రాష్ట్రంలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు: మంత్రి ఈటల

0
22

రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి పదేండ్లు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేవిధంగా పరిపాలన సాగిస్తున్నామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో తమ ప్రభుత్వం వెనుకకుపోయేది లేదని స్పష్టంచేశారు. కులవృత్తులను కించపరుచడాన్ని కాంగ్రెస్ ఇకనైనా మానుకుంటే మంచిదని హితవు పలికారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా, కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనైనా సరే.. ఎప్పుడైనా ఒక్క కుటుంబానికి నికరంగా రూ.ఐదు లక్షల ప్రయోజనం కల్పించిన దాఖలాలున్నయా? అట్ల ఉందని చూపిస్తే నేను రాజీనామా చేస్త. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒక్కో దళిత కుటుంబానికి రూ.17-20 లక్షల ప్రయోజనాన్ని చూపింది అని చెప్పారు. ఉద్యమ సమయంలో తెలంగాణ వచ్చేదా పోయేదా? అన్నరు.

LEAVE A REPLY