రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో వానలు

0
46

 నాలుగు జిల్లాల్లో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానకు భారీవృక్షాలు నేలకూలాయి. పిందె దశలో ఉన్న మామిడి రాలిపోవటంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో వడగండ్ల వాన ప్రభావం తీవ్రంగా ఉన్నది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని వివిధ గ్రామాలతోపాటు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి, రుద్రంగి మండలాల్లో వరి, మామిడికి నష్టం జరిగింది. బోయినపల్లి- గంగాధర ప్రధాన రహదారిపై తడిగొండ వద్ద రెండు భారీ చెట్లు విరిగిపడటంతో రవాణా స్తంభించింది. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, కొడిమ్యాల, కథలాపూర్, గొల్లపల్లి, వెల్గటూరు, బుగ్గారం, దమ్మయ్యపేట, పెగడపల్లి మండలాల్లో వడగండ్ల వాన ప్రభావం తీవ్రంగా ఉన్నది. ఈ మండలాల్లో వడగండ్ల వాన కారణంగా వరి, నువ్వులు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here