రాతియుగపు చరిత్రకు సాక్ష్యాలు

0
26

కుకునూరు సమీపంలోని మల్లన్న గుట్ట మీద రాష్ట్రకూటుల పాలనకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. గుట్ట శిఖరం మీద శిథిలమైన ముక్కిడమ్మ గుడి ఉన్నది. దాని చుట్టూ ఒకప్పుడు ఆరు అడుగుల రాతి గోడ ఉండేది. ఇప్పుడు రెండు వైపులా అక్కడక్కడా కూలిపోయి ఉన్నది. ఈ ఆలయానికి, దిగువన ఉన్న మల్లికార్జునస్వామి దేవాలయానికి మధ్య సహజ నీటిగుండం ఉన్నది. దీనిని దేవగణికల బాయి అని పిలుస్తున్నారు. దీనికి ఆగ్నేయ దిశలో మహిషాసురమర్దిని శిల్పం ఉంది. దానికి ఎదురుగా కొంచెం దూరంలో దేవాలయ స్తంభం పడి ఉంది. ఈ రెండూ రాష్ట్రకూటుల శైలిలో చెక్కినవని నిపుణులు చెబుతున్నారు. దిగువన ఉన్న భ్రమరాంబికా సహిత మల్లికార్జున స్వామి ఆలయం ఓ గుహాలయం. గుహద్వారంలో ఉన్న నందిశిల్పం రాష్ట్రకూటుల శైలిలో ఉన్నది. లోపలిగుహలోని గర్భగుడిలో రెండు శివలింగాలు ఉన్నాయి. మొదటిది స్ఫటికసమానమైన శిలతో చేసినది. దీనిని పుట్టులింగమని అంటారు. ఇది పెరుగుతున్నదని ప్రజల నమ్మకం. దాని పక్కనే ఉన్న రెండో లింగం శీర్షం పూల మొగ్గవలె ఉన్నది. లింగం అడుగున చుట్టూ గుండ్రని బొడిపెలు చెక్కి ఉన్నాయి.

LEAVE A REPLY