‘రాజా ది గ్రేట్’ ప్రారంభం

0
23

రవితేజ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిస్తున్న రాజా ది గ్రేట్ (వెల్‌కమ్ టు మై వరల్డ్ ఉపశీర్షిక) చిత్రం సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెహరీన్ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి నందమూరి కల్యాణ్‌రామ్ క్లాప్‌నివ్వగా, ఫైనాన్షియర్ ఎం.వి.ఆర్.ప్రసాద్ కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ భద్ర తర్వాత మా సంస్థలో రవితేజతో కలిసి చేస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో ఆయన పాత్ర చిత్రణ కొత్త పంథాలో వుంటుంది. వినూత్న కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకముంది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం అన్నారు. సుప్రీమ్ తర్వాత దిల్‌రాజు సంస్థలో రెండో చిత్రాన్ని చేయడం ఆనందంగా వుందని, రవితేజ శైలిలో చక్కటి వినోదాన్ని పంచే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత: శిరీష్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి.

LEAVE A REPLY