రాజమౌళిపై నెటిజన్ల విమర్శలు!

0
26

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా గర్వపడేలా చేశారు జక్కన్న. ఆ సినిమా ఇప్పటికే రూ.1500 కోట్లు పై చిలుకు కలెక్షన్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. అయితే.. రాజమౌళికి విజయానికి అతడి అంతకుముందు సినిమాలే సోపానాలని చెప్పారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ సింహాద్రి, రామ్‌చరణ్ మగధీర సినిమాల గురించి మాట్లాడారు. సినిమాలను బలవంతంగా వంద రోజులు థియేటర్లో ఆడించడం తనకు ఇష్టం లేదంటూ మగధీర సినిమా విషయంలో జరిగిన ఓ ఘటనను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో వివరించారు. మగధీర సినిమా విషయంలో అలా చేయడం వల్లే వంద రోజుల ఫంక్షన్‌కు వెళ్లలేకపోయానని చెప్పుకొచ్చారు. సింహాద్రి సినిమా జెన్యూన్‌గా ఎక్కువ థియేటర్లలో వంద రోజులు ఆడిందని, బలవంతంగా 175 రోజులు ఆడించే ప్రయత్నం చేస్తే వారించానని జక్కన్న ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

LEAVE A REPLY