రాజధాని జిల్లాలో మేజర్‌ గ్రామాలకు నగర నజరానా

0
26

పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్ల పదవీ కాలం సుమారు ఏడాదిన్నరలో ముగియనుంది. ఈలోపు నగర పంచాయతీల కసరత్తును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తి అవుతుంది. ఒక్కొక్క లోక్‌సభలో రెండేసి చొప్పున జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయి. కొత్తగా ఏర్పడే నగర పంచాయతీ కేంద్రాల్లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జిల్లాలో సమారు 21 నగర పంచాయతీలు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం ఉన్న 12 పురపాలక సంఘాలు, గుంటూరు నగరపాలక సంస్థ సమీపంలోని సుమారు 40 గ్రామాలను ఆయా కేంద్రాల్లో కలపాలని ప్రతిపాదిస్తున్నారు. కొత్తగా ప్రతిపాదించిన నగర పంచాయతీల్లో కొన్ని గ్రామాలు ఇప్పటికే 25 వేల జనాభా దాటింది. మరికొన్నింటికి సమీపంలోని చిన్న పంచాయతీలను విలీనం చేయనున్నారు. జిల్లాలోని 50 గ్రామాలు 21 నగర పంచాయతీలుగా రూపాంతరం చెందనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here