రాజకీయ పార్టీల్లో కలకలం..

0
26

కడపలో 119వ బూత్‌లో 258 మంది ఓటర్లున్నారు. వారిలో 130 మంది తమ ఓటు హక్కు స్వంత గ్రామాల్లో నమోదు చేసుకున్నారని కడపలో ఓటు వద్దని కరాఖండిగా చెప్పారు. దీంతో ఆ బూతలో ఓటర్లు 128 మందే మిగిలారు. కడప నియోజక వర్గ ఓటర్ల ప్రత్యేక సవరణలలో భాగంగా ఇంటింటి కెళ్లిన ఎన్నికల విభాగం అధికారులకు ఇలాంటి పరిస్థితులు కనిపించాయి. మొత్తం మీద 261 పోలింగ్‌ బూత్‌ల పరిధిలో జరిగిన ప్రత్యేక ఓటరు జాబితా తయారీలో కడప ఓటర్లు అక్షరాల 86716 మంది గల్లంతు కాగా, నిఖార్సుగా 1,53,810 మంది ఓటర్లు మిగిలారు. అందులో మహిళా ఓటర్లు 78,789 కాగా, పురుషుల ఓటర్లు 74,999 మంది ఉన్నారు. ఇతరులు 22 మంది ఓటర్లున్నట్లు అధికారులు తేల్చారు. ఆదివారం కొత్త ఓటర్ల జాబితా బూత్‌‌ల వారీగా అందించే దిశగా కడప తహసీల్దార్‌ ప్రేమంతకుమార్‌ జాబితాలను ఇప్పటికే బీఎల్‌వోలకు అందజేశారు. అదేవిధంగా కార్పొరేటర్లు, రాజకీయపార్టీల ప్రతినిధులు, ఏజెంట్లు కూడా బూత్ ల వద్దకు వచ్చి తప్పొప్పుల సవరణపై ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు.

LEAVE A REPLY