రష్యా టీవీ షోలో పిడిగుద్దులు

0
28

రష్యాలో కార్మికుల వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయన్న అంశంపై రష్యా టీవీ చానల్ పోలాండ్, ఉక్రెయిన్‌కు చెందిన వివిధ వర్గాలతో నిర్వహించిన ఓ కార్యక్రమం వ్యాఖ్యాతల పిడిగుద్దులతో రసాభాసగా మారింది. పోలాండ్ జర్నలిస్ట్ తోమజ్ మాసీజ్‌జుక్, ఉక్రెయిన్ మాజీ ఎంపీ ఇహోర్ మార్కోవ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొన్నది. ఈ క్రమంలో ఉక్రెయిన్లు సామాన్య పౌరుల్లా జీవనం గడుపాలని కోరుకొంటున్నారని.. కానీ నీలా అశుద్ధంలాంటి రష్యాలో జీవించాలని కోరుకోవడంలేదని అన్నారు. దీంతో షోను నిర్వహిస్తున్న రోమన్ బాబయాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తన చేతిలోని పేపర్‌ను తోమజ్ ముఖంపైకి విసిరాడు. అలాంటిచోట నివసించేది నీవేనని మండిపడ్డాడు. ఇక ఇహోర్ ఒక్కసారిగా లేచి తోమజ్ ముఖంపై కొట్టాడు. పోలాండ్ ఇతర యూరోప్ దేశీయులపై రష్యన్లు చేసే వ్యాఖ్యలకంటే తాను చెడ్డగా ఏమీ అనలేదని తోమజ్ వాదించడం గమనార్హం. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానప్పటికీ యూట్యూబ్‌లో విడుదల కావడంతో వైరల్ అయ్యింది. ఉక్రెయిన్, పోలాండ్ మధ్య సరిహద్దు వివాదాల నేపథ్యంలో తాజా ఘటన వాటిని మరింత తీవ్రం చేసిందని విశ్లేషకులు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here