రష్యా చేతిలో ట్రంప్‌ సీక్రెట్లు..

0
32

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, భావి అధ్యక్షుడు ట్రంప్‌లకు అందజేసిన ఇంటిలిజెన్స్‌ నివేదిక దుమారం రేపుతోంది. రష్యా ఇంటిలిజెన్స్‌ సర్వీసు చేతిలో ట్రంప్‌కు సంబంధించిన కీలకమైన, వ్యక్తిగత సమాచారం కూడా ఉందని పేర్కొంది. వీటిపై ఖచ్చితంగా రూడీకాలేదని ఇంటిలిజెన్స్‌ సంస్థలు చెబుతున్నాయి. కానీ దీనికి సంబంధించిన సమాచారాన్ని అత్యంత నమ్మకస్థులే అందజేశారని నివేదికలో తెలిపారు. వీటి ఆధారంగా బాధ్యులకు నోటీసులు జారీ చేయవచ్చని పేర్కొంది. దీనిపై మంగళవారం ట్రంప్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘కల్పిత వార్తలని.. మొత్తం రాజకీయం’ అని ఆయన అన్నారు.

దీనిపై సీనియర్‌ అమెరికా అధికారి మాట్లాడుతూ తాము నివేదికలో కేవలం చాలా తక్కువే చెప్పామన్నారు. రష్యా ఇంటిలిజెన్స్‌ వర్గాలు ఇద్దరు నాయకులకు సంబంధించిన దారుణమైన సమాచారాన్ని సేకరించారని పేర్కొన్నారు. కానీ డెమక్రటిక్‌ పార్టీ అభ్యర్థిని దెబ్బతీసే ఉద్దేశంతో ఆ సమాచారం మాత్రమే విడుదల చేశారని పేర్కొన్నారు. ట్రంప్‌ను గెలిపించాలనే లక్ష్యంతోనే రష్యా నిఘా వర్గాలు ఈ విధంగా చేశాయన్నారు.

LEAVE A REPLY