రవిశాస్త్రిది తప్పే

0
14

భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ విషయంలో రవిశాస్త్రి ప్రవర్తన సరైందికాదని మాజీ కెప్టెన్ అజరుద్దీన్ అన్నాడు. భారత జట్టు డైరెక్టర్‌గా పని చేసిన శాస్త్రి ఇటీవల టీమ్ ఇండియా ఉత్తమ కెప్టెన్ల జాబితాను రూపొందించి విడుదల చేశాడు. ఇందులో కపిల్‌దేవ్, వాడేకర్, పటౌడీలాంటి వ్యక్తులకు చోటు కల్పించిన శాస్త్రి.. గంగూలీని మాత్రం విస్మరించాడు. దీంతో పాటు భారత కెప్టెన్లందరికీ దాదా.. ధోనీ అని ప్రశంసలు గుప్పించాడు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. శాస్త్రివి పనికిమాలిన మాటలు. అతను గణాంకాలు చూడలేదేమో. గొప్ప కెప్టెన్ల జాబితాను త యారు చేయాలనుకుంటే వ్యక్తిగత కక్షలు పక్కనబెట్టాలి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఒక వ్యక్తిని కించపర్చడం సరైందికాదు అని అజర్ ఘాటుగా విమర్శించాడు.

LEAVE A REPLY