రవితేజ ‘టచ్‌ చేసి చూడు’

0
19

రవితేజ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది. విక్రమ్‌ సిరికొండ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ‘టచ్‌ చేసి చూడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బేబి భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్నారు. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. త‌మ‌కు చిరకాల మిత్రుడైన రవితేజతో సినిమా నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. వక్కంత వంశీ చక్కటి కథను తయారు చేశారని, ఫిబ్రవరి మొదటివారంలో చిత్రీకరణ మొదలు పెడుతున్నట్లు తెలిపారు. ఇందులో ఇద్దరు కథానాయికలు నటిస్తుండగా రాశిఖన్నాను ఒక పాత్ర కోసం ఎంపిక చేశారు. సంగీతం: ప్రీతమ్స్‌, ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్‌

LEAVE A REPLY