‘రయీస్‌’ 20 కోట్లు.. ‘కాబిల్‌’ 10 కోట్లు

0
32

బాలీవుడ్‌ స్టార్స్‌ షారుక్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ హీరోలుగా నటించిన ‘రయీస్‌’, ‘కాబిల్‌’ చిత్రాలు బుధవారం (జనవరి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు తొలిరోజున బాక్సాఫీసు వద్ద దేశవ్యాప్తంగా ఎంత వసూలు చేశాయో సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ‘రయీస్‌’ చిత్రం రూ. 20.42 కోట్లు వసూలు చేసిందని, గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా వసూళ్లు పెరిగే అవకాశం ఉందని ట్వీట్‌ చేశారు.

హృతిక్‌ రోషన్‌ ‘కాబిల్‌’ చిత్రం తొలిరోజున రూ. 10.43 కోట్లు వసూలు చేసిందని తరణ్‌ తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం వసూళ్లు పెరిగే అవకాశం ఉందన్నారు.

LEAVE A REPLY