రద్దయిన కరెన్సీ అంతా ఖాతాల్లోకే ..

0
24
  • నోట్ల రద్దు వ్యవహారంలో ప్రభుత్వానికి భారీ ఆశాభంగం తప్పదని సరికొత్త విశ్లేషణలు వినవస్తున్నాయి. నల్లధనాన్ని వెలికితీయడమే ప్రధాన లక్ష్యంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు మోదీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అంచనాలు ఫలిస్తే సర్కారు ఖజానాకు దాదాపు 4-5 లక్షల కోట్ల రూపాయల మేర లాభం కలిగేది. అయితే ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి చూస్తే అంత సీన్‌ లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇదెలాగో చూద్దాం..
  • ప్రభుత్వం రద్దు నిర్ణయం తీసుకోవడానికి ముందు దేశంలో 1716.5 కోట్ల 500 రూపాయల నోట్లు, 685.8 కోట్ల 1000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి ఉమ్మడి విలువ 15.44 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో 500 రూపాయల నోట్ల వాటా 8.58 లక్షల కోట్ల రూపాయలు. 1000 రూపాయల నోట్ల వాటా 6.86 లక్షల కోట్ల రూపాయలు.
  • ప్రభుత్వం వేసుకున్న అంచనాల ప్రకారం…. బ్యాంకుల్లో సుమారు 10-11 లక్షల కోట్ల రూపాయల విలువైన రద్దయిన కరెన్సీ నోట్లు డిసెంబర్‌ ఆఖరు నాటికి డిపాజిట్‌ అయ్యే అవకాశం ఉంది. దాదాపు 4-5 లక్షల కోట్ల రూపాయల నల్లధనం బయటకు రాలేక శాశ్వతంగా చీకట్లనే సమాధి అవుతుంది. ఇలా బ్యాంకుల్లోకి రాకుండా నల్లధనసాముల గోదాముల్లోనే సమాధయ్యే కరెన్సీ అంతా ఆర్‌బిఐ ఖాతాల్లో లాభంగా మిగులుతుంది. దీనిని సర్కారుకు డివిడెండ్‌గా బదలాయిస్తుంది.
  • క్షేత్రస్థాయి వాస్తవాలను చూస్తే మాత్రం ప్రభుత్వం వేసుకున్న లెక్కలు దారుణంగా బెడిసికొట్టేలా కనిపిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నవంబర్‌ 10 నుంచి నవంబర్‌ 27 మధ్య 18 రోజుల్లోనే 8.45 లక్షల కోట్ల రూపాయల విలువైన రద్దయిన కరెన్సీ నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్‌ అయ్యాయి. ఈ విషయం ప్రభుత్వమే స్వయంగా పార్లమెంట్‌లో వెల్లడించింది. గత మూడునాలుగు రోజుల లెక్కలు కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయలు దాటి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here