రజినీపై డైరెక్టర్ భారతీరాజా అసభ్యకర వ్యాఖ్యలు

0
22

రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తాను అంటేనే తమిళనాడు ఉలికి..ఉలికి పడుతోంది. తమిళుడివే కానప్పుడు.. ఇక్కడెలా పోటీ చేస్తావంటూ కోలీవుడ్‌లోని తోటి నటులే అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. కమల్ హాసన్ లాంటి పెద్ద స్టార్ హీరో కూడా రజినీపై విమర్శలు గుప్పించారు. తాజాగా కోలీవుడ్ టాప్ డైరెక్టర్ భారతీ రాజా కూడా రజినీపై విమర్శలు గుప్పించారు. విమర్శలనే కన్నా బూతులు వాడాడంటే బాగుంటుంది. ఎందుకంటే రజినీపై ఆయన చేసిన వ్యాఖ్యలు అలాంటివి మరి. దిగజారిపోయి అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశారు భారతీరాజా. ఫిల్మ్ డైరెక్టర్లు చెన్నైలోని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అన్న మాటలకు అక్కడకు వచ్చిన వారంతా నిశ్చేష్టులయ్యారు. వాస్తవానికి మే 17న మెరీనా బీచ్‌లో ఈలం వార్ బాధితులకు నివాళిగా సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఆ సభను భగ్నం చేసిన పోలీసులు ఆ ఉద్యమానికి ఆద్యుడైన తిరుమురుగన్ గాంధీని అరెస్ట్ చేశారు. అతడిని అరెస్టు చేసినందుకు గానూ పోలీసులపై మండిపడిన భారతీరాజా.. రజినీపై అసభ్య వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY