రజనీతో జోడీగా..

0
13

సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జోడీగా నటించాలని ప్రతి కథానాయిక కోరుకుంటుంది. ఆయనతో ఒక్క సినిమా చేసినా చాలు..తమ కెరీర్‌కు లభించిన గౌరవంగా భావిస్తారు. ఇప్పటివరకు సోనాక్షి సిన్హా, ఐశ్వర్యరాయ్, అమీజాక్సన్ వంటి బాలీవుడ్ నాయికలు రజనీకాంత్‌తో నటించారు. తాజాగా వీరి జాబితాలో దీపికాపదుకునే చేరనుంది. వివరాల్లోకి వెళితే.. పా రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దీపికాపదుకునేను కథానాయికగా ఖరారు చేయనున్నట్లు తెలిసింది. గతంలో రజనీకాంత్‌తో కలసి దీపికాపదుకునే కొచ్చాడియన్ (విక్రమసింహా) చిత్రంలో నటించింది. అయితే ఈ చిత్రాన్ని గ్రాఫిక్స్ ప్రధానంగా మోషన్ క్యాప్చర్ అనే సాంకేతికతో తెరకెక్కించారు. తాజాగా ప్రధాన స్రవంతి చిత్రంలో రజనీకాంత్‌తో తొలిసారిగా జోడికట్టబోతుంది దీపికాపదుకునే. త్వరలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. హీరో ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ 2.0 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే పా రంజిత్ దర్శకత్వం చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు తెలిసింది. చెన్నైలోనే సినిమాకు సంబంధించిన ప్రధాన ఘట్టాల్ని తెరకెక్కిస్తారని సమాచారం

LEAVE A REPLY