రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై నిరసనలు

0
20

సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశ వార్తలు తమిళనాట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన తమిళమూలాలపై అక్కడి భాషా సాంస్కృతిక సంస్థలు విరుచుకుపడుతుండగా, ఆయన రాజకీయాల్లోకి వస్తే అడ్డుకుంటామని పలుసంఘాలు నిరసన చేపడుతున్నాయి. తాజాగా తమిళ మున్నేట్ర పడయ్ అనే సంస్థ సోమవారం పోయస్‌గార్డెన్‌లోని రజనీ నివాసాన్ని ముట్టడించింది. ఆయన దిష్టిబొమ్మను దహనం చేసింది. రజనీ తమిళుడు కాదని, ఆయనను రాజకీయాల్లోకి రానివ్వబోమని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఆయన కర్ణాటక మూలాలను నిరసనకారులు పదే పదే ప్రస్తావించారు. ఇటీవల అభిమానులతో సమావేశమైన కబాలి హీరో తమిళనాడులోని కృష్ణానగరి జిల్లాలోని ఓ ఊరు మా స్వస్థలం. నేను పక్కా తమిళుడిని అంటూ వ్యాఖ్యానించడంతో దుమారం మొదలైంది. కర్ణాటకకు చెందిన మరాఠీ కుటుంబంలో రజనీకాంత్ పుట్టాడని తమిళ సంస్థలు పేర్కొంటున్నాయి. ఆయనను ఆరాధిస్తామేకానీ తమిళనాడును పాలించే అధికారం అప్పగించలేమన్నది పలు సంఘాల వాదన. నిరసనలు పెరుగుతున్న నేపథ్యంలో రజనీ నివాసం వద్ద పోలీసులు భద్రతను పెంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here