రజనీకాంత్ కాలికి స్వల్ప గాయం

0
32

సూపర్ స్టార్ రజనీకాంత్ కాలికి స్వల్ప గాయమైంది. చెన్నై శివారు ప్రాంతంలో 2.0 సినిమాను చిత్రీకరిస్తుండగా రజనీకాంత్ ఎడమ కాలికి స్వల్ప గాయమైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది. షూటింగ్ సమయంలో మెట్లపై నడుస్తుండగా రజనీ జారి పడటంతో కాలికి గాయమైనట్లు చెప్పింది చిత్ర యూనిట్. షూటింగ్ నుంచి హుటాహుటిగా చెట్టినాడ్ ఆస్పత్రికి రజనీకాంత్‌ను తరలించారు. అరగంట పాటు కాలికి వైద్యం చేసిన డాక్టర్లు ఆ తర్వాత రజనీని ఇంటికి పంపించారు. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యంగా ఉన్నారని, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్ర సిబ్బంది చెప్పింది.

LEAVE A REPLY