రజనీకాంత్‌ అభిమానులకు శుభవార్త!

0
44

‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తోన్న నేపథ్యంలో నటనకు స్వస్తి పలకబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ‘కాలా’ తర్వాత ఆయన కేవలం ఒక చిత్రంలో మాత్రమే నటిస్తారని, దాని తర్వాత నటించరని అన్నారు. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో ఉంటుందని, దీని ద్వారా రజనీ అభిమానులకు ప్రభావమంతమైన సందేశం ఇవ్వనున్నారని చెప్పుకొచ్చారు.

కాగా, ఎట్టకేలకు రజనీ కొత్త చిత్రాన్ని శుక్రవారం ప్రకటించారు. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ సినిమాను రూపొందిస్తున్నారు. కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. రజనీ నటిస్తారా? లేదా? అనే సందిగ్ధంలో ఉన్న అభిమానులకు ఇది శుభవార్తే కదా.

కార్తిక్‌ గతంలో ‘పిజ్జా’, ‘జిగర్తాండా’, ‘ఇరైవి’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. రజనీ కోసం కథ సిద్ధంగా ఉందని, ఆయన ఒప్పుకొంటే చేస్తానని ఆయన‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

LEAVE A REPLY