రజనీకాంత్‌కి చేదు అనుభవం

0
12

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి చేదు అనుభవం ఎదురైంది. తూత్తుకుడి క్షతగాత్రులను పరామర్శించేందుకు ఆయనని సంతోజ్‌రాజ్ అనే వ్యక్తి ‘ఎవరు మీరు’ అని అడిగారు. దాంతో రజనీ‌కాంత్ నవ్వుకుంటూ వెళ్లిపోయారు. కాగా ఇటీవల తూత్తుకుడిలో స్టెరిలైట్ రాగి పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలో 13 మంది మృతి చెందగా మరో 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులందరికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అయితే వారిని పరామర్శించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఆస్పత్రికి వెళ్తుతున్నారు. ఇలా రజనీకాంత్ కూడా అక్కడికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సమయంలోనే సంతోష్ రాజు అనే వ్యక్తి.. రజనీని నిలదీశారు. ‘మీరు ఎవరు ’ అని అడగడంతో అది కాస్తా వైరల్‌గా మారి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. అయితే సంతోష్ రాజు.. ఇంతకుముందు వచ్చిన నేతలతో కూడా ఇలానే మాట్లాడినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. కానీ రజనీని కూడా ఆగడటంతో ఆయన అభిమానులు సంతోష్ ప్రవర్తన మండిపడుతున్నారు.

LEAVE A REPLY