రంగుల పండుగలో విషాదం

0
29

హోలీ పండుగ పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఆదివారం స్నానాలకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీటమునిగి 13 మంది ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గల్లంతయ్యారు. జనగామ జిల్లాలో సెల్ఫీ సరదా ఇద్దరు యువకుల ప్రాణం తీసింది. జిల్లా కేంద్రానికి చెందిన పానుగంటి క్రాంతికుమార్ (19), నంగునూరి నాగరాజు (20), అంకేనపల్లి ఆఖిల్ హోలీ వేడుకల అనంతరం స్నానాలకు నర్మెట మండలంలోని బొమ్మకూరు రిజర్వాయర్‌కు వెళ్లారు. ఈతకొట్టిన తర్వాత కర్రసాయంతో రిజర్వాయర్ బండరాళ్లపైకి వెళ్లి సెల్ఫీ దిగుతుండగా జారిపడగా, క్రాంతికుమార్, నాగరాజు నీటమునిగి మృతిచెందారు. మహబూబాబాద్ జిల్లాలో నీటమునిగి ముగ్గురు మరణించారు. కురవి మండలం అయ్యగారిపల్లికి చెందిన నర్ర చరణ్(9), బైరి వీరేశ్(10) ఊరి చివరనగల బొంతికుంట చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి నీటమునిగి చనిపోయారు. చరణ్ మూడో తరగతి, వీరేశ్ నాలుగో తరగతి చదువుతున్నారు. తొర్రూరు మండలం ఫత్తేపురానికి చెందిన గూడెల్లి నరేశ్(18) గ్రామసమీపంలోని చెరువుకు స్నానానికి వెళ్లగా నీటముగిని మృతి చెందాడు. గోదావరి నదిలో నీటమునిగి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. భద్రాచలం పట్టణం శిల్పినగర్ కాలనీకి చెందిన మారంపూడి రాంప్రసాద్(19), అయ్యప్పకాలనీకి చెందిన బోడా రమేష్(19) స్నేహితులతో కలిసి స్నానాల కోసం గోదావరి నదికి వెళ్లారు

LEAVE A REPLY