యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం

0
23

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మతో పాటు 43 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంలు, మంత్రుల చేత ఆ రాష్ర్ట గవర్నర్ శ్రీరాం నాయక్ ప్రమాణస్వీకారం చేయించారు. యూపీకి యోగి ఆదిత్యనాథ్ 21వ ముఖ్యమంత్రి. కాన్షీరాం స్మృతి ఉప్‌వన్‌లో అట్టహాసంగా జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఎస్సీ అధినేత ములాయం సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, ఆయా రాష్ర్టాల బీజేపీ ముఖ్యమంత్రులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here