యూపీలో రైతు రుణమాఫీ ఎలా సాధ్యం: కేటీఆర్

0
43

రైతు రుణాల మాఫీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తున్నదని మంత్రి కే తారకరామారావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరలో పరిస్థితి తీవ్రత గురించి ఎంతగా వివరించినా కేంద్రం నిర్దయగా వ్యవహరించిందని, ఇప్పుడు అదే ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌లో రుణమాఫీకి సిద్ధమయిందని తప్పుబట్టారు. ఉత్తరప్రదేశ్‌కు ఒక నీతి, తెలంగాణకు మరో నీతా? ఇదెక్కడి న్యాయం? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర రైతులు అక్కడి రైతుల మాదిరి కాదా? ప్రధానమంత్రి కేవలం ఉత్తరప్రదేశ్‌కు మాత్రమేనా.. తెలంగాణకు కాదా? అంటూ నిలదీశారు.

LEAVE A REPLY