యూపీలో కాంగ్రెస్-ఎస్పీ పొత్తు

0
18

యూపీలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు కుదిరింది. కాంగ్రెస్‌కు 104-106 సీట్లను ఇచ్చేందుకు ఎస్పీ అంగీకరించింది. సమాజ్‌వాదీ పార్టీ 289 స్థానాల్లో పోటీ చేయనుంది. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఇప్పటికే 191 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.

ఇవాళ లక్నోలో నిర్వహించిన ఎన్నికల మానిఫెస్టో కార్యక్రమంలో అఖిలేశ్ యాదవ్, డింపుల్ దంపతులతోపాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అఖిలేశ్ ఈ సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా అఖిలేశ్ మాట్లాడుతూ యూపీలో సమాజ్‌వాదీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రధాని మోదీ ప్రజలను ఇబ్బంది పెట్టారన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి పేదలకు చేసిందేమీ లేదన్నారు

LEAVE A REPLY