యూపీలో కబేళాలను మూసివేస్తే 25 లక్షల మంది ఉపాధికి ఎసరు

0
16

ఉత్తరప్రదేశ్‌లో మాంసం దుకాణదారులు, ఎగుమతిదారులు చేపట్టిన నిరవధిక సమ్మె మూడోరోజుకు చేరుకున్నది. దుకాణాలన్నీ మూసి ఉండటంతో ఆ రాష్ట్రంలో మాం సానికి కొరత నెలకొంది. కబేళాలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగ, ఉపాధితోపాటు రాష్ట్ర ఆదాయంపైనా తీవ్ర ప్రభావం చూపనున్నాయి. మాంసం పరిశ్రమపై ఆధారపడిన 25 లక్షల మందికి ఇబ్బందులు తప్పేలా లేవు. ఉద్యోగాలు కోల్పోతే తమ పరిస్థితి ఏమిటని కబేళాల కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అక్రమ కబేళాల మూసివేతతో వచ్చే ఐదేండ్లలో రూ.56 వేల కోట్ల ఆదాయం యూపీ కోల్పోనున్నది.

LEAVE A REPLY