యూపీఎస్సీ చైర్మన్‌గా డేవిడ్ ఆర్ స్యీమ్లీ

0
28

న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలిక చైర్మన్‌గా విద్యావేత్త డేవిడ్ ఆర్ స్యీమ్లీ నియామకాన్ని కేంద్ర క్యాబినెట్ ఖరారుచేసింది. మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి అల్కా సిరోహి నుంచి ఆయన బాధ్యతలు చేపడుతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన క్యాబినెట్ ఆయన నియామకానికి ఆమోదం తెలిపినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. క్యాబినెట్ దీంతోపాటు పలు నిర్ణయాలు తీసుకుంది. సిరోహి 2012 జూన్ నుంచి యూపీఎస్సీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అసోంకు చెందిన సిరోహి.. షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీలో పీజీ (హిస్టరీ) చదివారు. ఈశాన్య ప్రాంత చరిత్రకు సంబంధించి అనేక పుస్తకాలు వెలువరించారు. ఆ యూనివర్సిటీలో పలు పదవులు నిర్వహించడంతోపాటు అరుణాచల్‌ప్రదేశ్‌లోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు.

LEAVE A REPLY