యూఎన్‌లో అమెరికా రాయబారిగా నిక్కి హేలీ!

0
22

త్వరలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న డొనా ల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగంలో భారత సంతతికి చెందిన నిక్కి హేలీ(44)కు అరుదైన గౌరవం లభించనున్నది. సౌత్ కరోలినా గవర్నర్‌గా సేవలందిస్తున్న నిక్కి హేలీని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా నియమిస్తూ ట్రంప్ కీలక నిర్ణయాన్ని తీసుకొన్నారని ప్రముఖ పత్రిక సీఎన్‌ఎన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆమె నియామకానికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే వెలువడుతుందని పేర్కొన్నది. శ్వేతసౌధంలో అధికార మార్పిడికి ముందు ఏర్పాటవుతున్న అత్యున్నతస్థాయి ట్రంప్ పాలన వ్యవస్థలో కీలక పదవిని దక్కించుకొన్న మహిళగా హేలీ ఓ ఘనతను సొంతం చేసుకొనే అవకాశం దక్కనున్నది. రిపబ్లికన్ పార్టీలో అగ్రనేతగా మారేందుకు హేలీకి ట్రంప్ ఉన్నత పదవిని కట్టబెట్టనున్నారని పోస్ట్ అండ్ కొరియర్ కథనాన్ని ప్రచురించింది. తన రాష్ట్రంలో తొలి మహిళా, మొట్టమొదటి మైనారిటీ గవర్నర్‌గా నిక్కి హేలీ పాలనలో తనదైన ముద్రను చాటుకొన్నారని పేర్కొన్నది. అనేక వాణిజ్య, శ్రామిక సమస్యలను పరిష్కరించడంలో విశేష ప్రతిభ చాటారని పలు పత్రికలు వెల్లడించాయి.

LEAVE A REPLY