యువీ.. ఆల్‌రౌండ్‌ మెరుపులు

0
21

టీమిండియా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ మెరిశాడు. విజయ్‌ హాజారే దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీలో తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రైల్వేస్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను విజయ తీరాలకు చేర్చాడు. 66 బంతుల్లో 66 పరుగులు చేసిన యువీ 35 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన రైల్వేస్‌ 9 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. అరిందమ్‌ ఘోష్‌ (83 పరుగులు) అర్ధశతకంతో రాణించాడు. లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్‌ మరో 5 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. యువీ (66; 66 బంతుల్లో 4×6, 6×1), గురుకీరత్‌ (69 నాటౌట్‌; 84 బంతుల్లో 4×4) అర్ధశతకాలు చేశారు. పంజాబ్‌ మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే నాకౌట్‌ దశకు అర్హత సాధిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here