యువతకు స్ఫూర్తి ‘ఘాజీ’

0
27
New Delhi: I & B Minister M Venkaiah Naidu at Parliament House during the winter session, in New Delhi on Monday. PTI Photo by Shahbaz Khan(PTI12_5_2016_000079B)

ఘాజీ చిత్రం దేశభక్తిని సరికొత్త రూపంలో పరిచయం చేసింది. 1971లో జరిగిన ఇండియా-పాకిస్థాన్ యుద్ధం గురించి ఎన్నో విషయాల్ని తెలియజెప్పింది. నేటి యువతకు స్ఫూర్తినిచ్చే చిత్రమిది. జాతి సమగ్రతకు ఇలాంటి చిత్రాలు అవసరమవుతాయి అన్నారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. పీవీపీ మరియు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఘాజీ చిత్రం ఇటీవలే విడుదలైంది. రానా, తాప్సీ, కేకే మీనన్, అతుల్‌కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. సంకల్ప్‌రెడ్డి దర్శకుడు. ఈ సినిమాను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు  హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ ప్రతిభాశాలి సంకల్ప్‌రెడ్డి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. జలాంతర్గామి ఎలా పనిచేస్తుందనే విషయాల్ని బాగా చూపించారు. యుద్ధ నేపథ్యమున్న ఈ చిత్రాన్ని హింసాత్మక సన్నివేశాలు లేకుండా రూపొందించడం అభినందనీయం. రానాతో పాటు నటీనటులందరూ ఉత్తమ ప్రతిభను కనబరిచారు. గొప్ప చిత్రాన్ని తీసిన దర్శకుడు సంకల్ప్‌రెడ్డిని అభినందిస్తున్నాను. అవార్డులు, రివార్డులు ఆశించకుండా ఓ మంచి సినిమాను తెరకెక్కించిన నిర్మాతకు కృతజ్ఞతలు అన్నారు.

LEAVE A REPLY