యుద్ధాల వ‌ల్లే అమెరికా ఆర్థిక వ్య‌వస్థ కుదేలు

0
21

ఖ‌రీదైన యుద్ధాల వ‌ల్లే అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేలైంద‌ని, దీనికి చైనాతో ఉన్న వాణిజ్య సంబంధాల‌తో ఎలాంటి సంబంధం లేద‌ని చైనా ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అలీబాబా ఓన‌ర్ జాక్ మా స్ప‌ష్టంచేశారు. కొత్త అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో వాణిజ్య యుద్ధానికి దిగ‌బోర‌ని, ఆయ‌న చాలా ఓపెన్ మైండెడ్ అని ఆయ‌న అన్నారు. ఈ మ‌ధ్యే ట్రంప్‌ను క‌లిసి జాక్ మా.. అమెరికాలో ప‌ది ల‌క్ష‌ల ఉద్యోగాలు సృష్టించ‌డంతోపాటు ల‌క్ష‌ల సంఖ్య‌లో అమెరికా ఉత్ప‌త్తుల‌కు మార్కెట్ క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. అమెరికా ఆర్థిక న‌ష్టాల‌కు చైనా కార‌ణ‌మ‌న్న వాద‌న త‌ప్ప‌ని జాక్ తెలిపారు. గ‌త 30 ఏళ్ల‌లో అమెరికా యుద్ధాల కోసం 14 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌ను వృథా చేసింద‌ని ఆయ‌న అన్నారు. అమెరికా ఉద్యోగాల‌ను చైనా దోచుకోలేద‌ని, అమెరికా చేసిన వ్యూహాత్మ‌క త‌ప్పిదాల వల్లే ఉద్యోగాలు పోయాయ‌ని జాక్ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here