యాసిడ్, లైంగికదాడి బాధితులకు ఆర్థిక సాంత్వన

0
8

లైంగికదాడి, యాసిడ్ దాడుల బాధితులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు నష్టపరిహారాన్ని నిర్ణయిస్తూ జాతీయ న్యాయసేవల అధీకృత సంస్థ (నల్సా) చేసిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. నూతన విధానం ప్రకారం.. ఇకపై లైంగికదాడి బాధితులకు కనీసం రూ.5 లక్షలు, యాసిడ్ దాడి బాధితులకు కనీసం రూ.7లక్షలు నష్టపరిహారంగా ప్రభుత్వం చెల్లించనుంది. ఘటన తీవ్రతను బట్టి గరిష్ఠంగా రూ.10లక్షల పరిహారం వరకు బాధితులకు అందనుంది. లైంగికదాడి, సామూహిక లైంగికదాడి, యాసిడ్ దాడి బాధితులకు ప్రత్యేకించి పేదవారికి, న్యాయపోరాటం చేసే శక్తిలేని గ్రామీణ పేదలకు.. ఆర్థికసాయం కింద పరిహారం ఇచ్చే అంశాన్ని పరిశీలించి, అందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం, నల్సా సంయుక్తంగా రూపకల్పన చేశాయి. ప్రస్తుతం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు లైంగికదాడి బాధితులకు వేర్వేరుగా పరిహారం చెల్లిస్తున్నాయి.

LEAVE A REPLY