యాలో రసాయనిక దాడి

0
13

సిరియాలో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న వాయవ్యప్రాంతంపై మంగళవారం జరిగిన విషవాయువు దాడిలో పలువురు చిన్నారులు సహా 58 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటనలో దాదాపు 160 మంది గాయపడినట్టు సమాచారం. విషవాయు ప్రభావానికి లోనైనవారిలో ఇంకొందరు మరణిస్తున్నట్టు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ మోనిటర్ తెలిపింది. ఈ దాడిపై ఐక్యరాజ్యసమితి విచారణ జరుపాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. ఈ దాడిలో ఎలాంటి రసాయనాలు వాడిందో ఇంకా వెల్లడి కాలేదు. అలాగే దాడికి పాల్పడింది సిరియా ప్రభుత్వ దళాలా.. లేక రష్యా దళాలా అనేది స్పష్టం కాలేదు. ఇద్లిబ్ ప్రావిన్స్‌లోని ఖాన్‌షేఖన్ పట్టణంలోని భవనాలపై యుద్ధవిమానాలు దాడి చేసినట్టు మానవ హక్కుల సంస్థ పేర్కొంది.

LEAVE A REPLY