యాభై ఏండ్ల అభివృద్ధే లక్ష్యంగా ఓయూ ఉత్సవాలు

0
22

దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) శతాబ్ది ఉత్సవాలకు, అభివృద్ధికి కార్యాచరణ సిద్ధమైంది. వచ్చే 50 ఏండ్లలో ఓయూ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని వర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, అం తర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా ఓయూకు అన్ని హంగులు కల్పిస్తున్నారు. కనివిని ఎరుగని విధంగా శతాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించడంతో అందుకు సంబంధించిన పనులు చురుకుగా కొనసాగుతున్నాయి.

LEAVE A REPLY