యాదాద్రిలో భారీ బస్ కాంప్లెక్స్

0
23

యాదాద్రి భువనగిరి : యాదాద్రి కొండపై దేశంలోని ఏ ఆలయానికి లేనివిధంగా భారీ బస్ కాంప్లెక్స్ రూపుదిద్దుకోనున్నది. భవిష్యత్‌లో పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బస్‌కాంప్లెక్స్ నిర్మాణానికి డిజైన్‌చేశారు. యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి తయారుచేసిన డిజైన్లకు సీఎం కేసీఆర్ ఆమోద ముద్రవేశారు. వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆలయ ఈవో గీత, ఆలయ సిబ్బందికి గురువారం ఆనంద్‌సాయి బృందం ఆలయ ప్రధా న కార్యాలయంలో బస్ కాంప్లెక్స్ నిర్మాణం, వసతులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో అవగాహన కల్పించారు.

LEAVE A REPLY