యాదగిరిగుట్టలో 20 గుడిసెలు దగ్ధం

0
37

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని యాదగిరిగుట్టలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలకు 20 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. గుడిసెలలో ఉన్న వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. కట్టుబట్టలతో మాత్రమే బయటపడ్డారు గుడిసెవాసులు. బాధితులంతా సన్‌షైన్ సంస్థలో పని చేస్తున్న కార్మికులు. సన్‌షైన్ సంస్థలో పని చేసేందుకు అక్కడ గుడిసెలు నిర్మించుకున్నారు. షార్ట్‌సర్క్యూట్‌తో గుడిసెలు అంటుకున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. బాధితుల రోదన ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

LEAVE A REPLY