యాక్సిస్ 20 ఖాతాల్లో రూ.60 కోట్లు

0
17

నోయిడా : అక్రమార్కుల గుట్టు ఒక్కటొక్కటిగా రట్టు అవుతున్నది. నోయిడాలోని సెక్టార్ 51 యాక్సిస్ బ్యాంక్‌లో 20 ఖాతాల్లో రూ.60 కోట్లు ఉండటాన్ని ఐటీ విభాగం గుర్తించింది. గురువారం బ్యాంకుకు వచ్చిన అధికారులు ఆ ఖాతాల్లోకి ఎక్కడెక్కడనుంచి డబ్బు వచ్చిందనే అంశంపై ఆరా తీశారు. ఈ ఖాతాలు షెల్ (నకిలీ) కంపెనీలవని.. నల్లధనాన్ని తెల్లగా మార్చుకోవడానికే వీటిని తెరిచినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ విషయంలో బ్యాంకు అధికారుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. ఓ బంగారు నగల దుకాణం వ్యాపారి నోట్ల రద్దు తర్వాత రూ.600 కోట్ల బంగారం విక్రయించినట్లు పేర్కొం టూ.. ఆ నగదు ఇదే బ్యాంకులో జమ చేయడం గమనార్హం. కాగా, తమ బ్యాంకు శాఖల్లో అనేక అవకతవకలు వెలుగుచూస్తుండటంతో యాక్సిస్ బ్యాంకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వారం రోజులుగా 50 ఖాతాలను నిలిపివేశామని.. ఈ వ్యహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 24మంది ఉద్యోగులను తొలగించినట్లు యాక్సిస్ రిటైల్ బ్యాంకింగ్ హెడ్ రాజీవ్ ఆనంద్ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here