యాంకర్ లాస్యకు కాబోయే భర్త ఇతడే….

0
17

బుల్లితెరపై స్టార్‌ స్టేటస్‌ అందుకున్న యాంకర్‌ లాస్య. బుల్లితెర ప్రోగ్రామ్స్‌తో, ఆడియో ఫంక్షన్లతో బిజీగా ఉన్న సమయంలోనే ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది లాస్య. ఆమె నిశ్ఛితార్థ వేడుక సోమవారం ఘనంగా జరిగింది. ఆ ఫోటోలను తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించింది లాస్య. వరుడి పేరు మంజునాథ్ అని, అతడు మరాఠి యువకుడని పేర్కొంది. జనవరి 29న ఆదివారం తమ ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగిందని లాస్య చెప్పింది.

అంతకు ముందు తన అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచడానికి తన చేతిపై ‘మంజు’ అని, కాబోయే భర్త చేతిపై ‘చిన్ని’ అని రాసి ఉన్న ఫోటోను పోస్ట్‌ చేసింది. అనంతరం అభిమానులు రిక్వెస్ట్ చేయడంతో సాయంత్రం 5 గంటలకు తన ఎంగేజ్ మెంట్ ఫొటోలను పోస్ట్ చేసి, తనకు కాబోయేవాడి గురించి తెలియజేసింది.

LEAVE A REPLY