యంగ్ తరంగ్!

0
16

హైదరాబాద్ ఆణిముత్యం. ఆటో నడిపితే గానీ పూట గడువని కుటుంబం నుంచి వచ్చిన మహ్మద్ సిరాజ్ అనతికాలంలోనే ప్రతిభ గల బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కష్టాన్ని నమ్ముకుంటూ..అంచలంచెలుగా ఎదిగిన సిరాజ్‌కు ఐపీఎల్ అరంగేట్రం కెరీర్‌ను మలుపు తిప్పింది. సిరాజ్ దేశవాళీ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ.2.6 కోట్లకు ఇతణ్ని సొంతం చేసుకుంది. మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్, కెప్టెన్ వార్నర్ నమ్మకాన్ని నిలబెడుతూ సిరాజ్ లీగ్ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మెరుపు వేగానికి తోడు స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన ఈ హైదరాబాదీ.. ఐపీఎల్‌లో ఆడిన 6మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. లీగ్ మొత్తమ్మీద నిలకడగా రాణించిన సిరాజ్..దిగ్గజ క్రికెటర్ సచిన్ ప్రశంసలు కూడా పొందాడు.

LEAVE A REPLY