యంగ్ టైగర్ వద్దకు టైగర్ వచ్చింది.

0
14

యంగ్ టైగర్ వద్దకు టైగర్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్‌కు ఆయన తండ్రి హరికృష్ణ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్‌లో ఉన్న ఎన్టీఆర్‌ను హరికృష్ణ కలిశారు. తండ్రి కొడుకులు కలిసి ఉన్న ఫొటోను మూవీ పీఆర్వో మహేష్ ఎస్ కోనేరు సోషల్ మీడియాలో ద్వారా షేర్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న ఈ సినిమా పేరు ‘జై లవకుశ’గా ప్రచారం నడుస్తోంది. యంగ్ టైగర్ త్రి పాత్రాభినయం చేస్తున్న ఈ మూవీని కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా, బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హరికృష్ణ నటించడం లేదని, జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసేందుకు మాత్రమే ఆయన సెట్స్‌కు వచ్చారని పీఆర్వో మహేష్ తెలిపారు.

LEAVE A REPLY