మ‌లేషియా మాస్ట‌ర్స్ చాంప్ సైనా

0
21

కొత్త ఏడాదిని విజ‌యంతో మొద‌లుపెట్టింది బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌. 2016 మిగిల్చిన చేదు అనుభ‌వాల‌కు చెక్ పెడుతూ.. ఈ ఏడాది పాల్గొన్న‌ మొద‌టి టోర్నీనే గెలిచింది. మ‌లేషియా మాస్ట‌ర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్‌ ఫైన‌ల్లో థాయ్‌లాండ్‌కు చెందిన చొచువాంగ్‌పై 22-20, 22-20 తేడాతో వ‌ర‌స గేమ్స్‌లో పోరాడి విజ‌యం సాధించిందీ హైద‌రాబాదీ స్టార్ షట్ల‌ర్‌. ఈ విజ‌యంతో ఆమెకు ల‌క్షా 20 వేల డాల‌ర్ల ప్రైజ్‌మ‌నీ ద‌క్కింది. రియో ఒలింపిక్స్ సంద‌ర్భంగా గాయ‌ప‌డిన సైనా.. మోకాలికి స‌ర్జరీ త‌ర్వాత గెలిచిన తొలి టైటిల్ ఇదే. గతేడాది జూన్‌లో ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ గెలిచిన సైనా.. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు మ‌రో టైటిల్‌ను త‌న ఖాతాలో వేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here