మ‌య‌న్మార్‌, పాక్ ఆక్ర‌మిత్ క‌శ్మీర్‌లో శుత్ర‌వుల‌కు దీటైన స‌మాధానం

0
16

మ‌య‌న్మార్‌, పాక్ ఆక్ర‌మిత్ క‌శ్మీర్‌లో శుత్ర‌వుల‌కు దీటైన స‌మాధానం ఇచ్చిన పారా క‌మాండోలు ఈసారి గ‌ణ‌తంత్ర దినోత్స‌వ ప‌రేడ్‌లో పాల్గొన‌డం లేదు. స‌ర్జిక‌ల్ దాడుల‌తో సంచ‌ల‌నంగా మారిన పారా క‌మాండోలు ఈ ఏడాది రాజ్‌ప‌థ్‌లో జ‌రిగే 68వ రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌కు దూరంగా ఉంటార‌ని అధికారులు తెలిపారు. వాళ్ల స్థానంలో ఎన్ఎస్‌జీకి చెందిన బ్లాక్ క్యాట్ క‌మాండోలు రంగంలోకి దిగుతారంటున్నారు. తొలిసారి బ్లాక్ క్యాట్ క‌మాండోలు రిప‌బ్లిక్ ప‌రేడ్‌లో అరంగ్రేటం చేయ‌నున్నారు. ప‌రేడ్‌లో పాల్గొనే ఆర్మీ యూనిట్ల‌ను చాలా ముందుగానే నిర్ణ‌యిస్తార‌ని, ఈసారి పారా క‌మాండోలు పాల్గొన‌డం లేద‌ని, వాళ్ల స్థానంలో ఎస్ఎస్‌జీ క‌మాండోలు ఉంటార‌ని ఆర్మీ అధికారి మేజ‌ర్ జ‌న‌ర‌ల్ రాజేశ్ సాహ‌య్ తెలిపారు. రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌లో కేవ‌లం పారా క‌మాండోలు మాత్ర‌మే పూర్తి స్థాయి సైనిక దుస్తుల్లో ద‌ర్శ‌న‌మిస్తారు. రాజ్‌ప‌థ్‌లో వాళ్లు వినూత్న శైలిలో చేసే విన్యాసాలు చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటాయి. గ‌త ఏడాది ప‌రేడ్‌లో పారా క‌మాండోలు పాల్గొన్నారు. ఈసారి బ్లాక్ క్యాట్ క‌మాండోల‌కు అవ‌కాశం ద‌క్క‌డం వ‌ల్ల మ‌ళ్లీ పారా క‌మాండోలు వ‌చ్చే ఏడాది ప‌రేడ్‌లో పాల్గొనే అవ‌కాశాలున్నాయి. గ‌త ఏడాది ప‌ఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి జ‌రిన‌ప్పుడు ఎన్ఎస్‌జీ క‌మాండోలు త‌మ స‌త్తాను ప్ర‌ద‌ర్శించారు. ఈసారి ప‌రేడ్‌లో మొత్తం వంద మంది ఎన్ఎస్‌జీ క‌మాండోలు పాల్గొనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here