మ్యానిఫెస్టో అమలుచేసింది టీఆర్‌ఎస్సే

0
23

అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే ఎన్నికల మ్యానిఫెస్టోను అమలుచేసిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్సేనని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. మంగళవారం రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురంలో 30 డబుల్ బెడ్‌రూంలకు శంకుస్థాపన చేశారు. 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెంలో సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. దమ్మపేటలో పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించి సాగుకు నిరంతరం తొమ్మిది గంటల విద్యుత్‌ను అందించే స్థాయికి రాష్ర్టాన్ని తీసుకొచ్చారని, భవిష్యత్‌లో 24 గంటల విద్యుత్ ఇస్తామన్నా రు. త్వరలో భద్రాద్రి పవర్ ప్లాంట్, కేటీపీఎస్ ఏడో దశ విస్తరణ పనులను ప్రారంభిస్తామన్నారు.

LEAVE A REPLY