మోదీ.. మీ సాహసం భళా!.. మళ్ళీ సమర్థించిన నితీశ్

0
19

పాట్నా: పెద్ద నోట్ల రద్దుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని బీహార్ సిఎం నితీశ్ కుమార్ మరోసారి కితాబునిచ్చారు. మోదీ నిర్ణయంతో దేశానికి మేలు జరుగుతుందని చెప్పారు. వాస్తవానికి నోట్ రద్దుపై జెడియూ సీనియర్ నేత, ఎంపీ శరద్ యాదవ్ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. మిగతా పక్షాల నేతలతో కలిసి నోట్లరద్దుకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేపట్టారు. జెడియూ ఎంపీలు కూడా నోట్ల రద్దు వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నారు. సంకీర్ణ భాగస్వామ్య పక్షమైన రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నోట్ల రద్దుపై మోదీపై వ్యంగ్య బాణాలు సంధించారు. మోదీది తెలివిలేని నిర్ణయమన్నారు. నోట్ల రద్దుపై మోదీని జెడియూ, ఆర్జేడీ నేతలు స్వయంగా వ్యతిరేకిస్తున్నా సిఎం నితీశ్ కుమార్ మాత్రం గట్టిగా వెనకేసుకొస్తున్నారు. మోదీని పొగడటం తగ్గించాలని బీహార్ నేతలు స్వయంగా సూచిస్తున్నా నితీశ్ మాత్రం నోట్ల రద్దుతో దేశ ప్రజలకు మేలు జరుగుతుందని ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో మిగతా ప్రతిపక్ష నేతలంతా ఒకవైపుంటే ఒక్క నితీశ్ కుమార్ మాత్రం ఎన్డీయే పక్షాల వైపు ఉన్నట్లైంది.

LEAVE A REPLY