మోదీని వందసార్లు కాల్చినా తప్పులేదు : నారాయణ

0
24

‘ప్రధాని మోదీని వందసార్లు కాల్చినా తప్పులేదు. 127 కోట్ల ప్రజల గుండెల్లో గునపా లు దింపాడు. నల్లదొరలను కాపాడడం కోసం సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టా డు. ఆయన శిక్షార్హుడో కాదో ప్రజాకోర్టులో తేల్చుకోవాలి.’ అని సీపీఐ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కె.నారాయణ మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడా రు. నోట్ల రద్దును కేంద్ర మంత్రి వెంకయ్య మహాయజ్ఞంతో పోల్చాడు. బ్లాక్‌ మనీని, కార్పొరేట్‌ సంస్థలను కాపాడటానికి ఈ మహాయజ్ఞం చేస్తున్నారు. వారి మహాయజ్ఞానికి.. ప్రజల ఆక్రోశానికి మధ్య జరిగే పోటీనే సోమవారం జరిగే బంద్‌. ప్రజలు విజయవంతం చేయాలి. ఏ పార్టీలు ప్రజలవైపో కూడా తేలిపోతుంది అని ఆయన స్పష్టం చేశారు. ‘క్యూల్లో బాధపడేది సామా న్య ప్రజానీకమే. కార్పొరేట్‌ సంస్థల అధిపతులు ఎవరూ క్యూల్లోకి రావడంలేదు. నోట్ల రద్దుతో బిచ్చగాళ్లు సైతం బాధపడుతున్నారు.’ అని చెప్పారు.

LEAVE A REPLY