మోదీతో సమావేశమైన కామెరాన్‌

0
20

దిల్లీ: బ్రిటన్‌ మాజీ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ దిల్లీలో శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. నవంబరు 2015లో యూకేలో పర్యటించిన సందర్భంగా భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి సహకరించినందుకు కామెరాన్‌కు మోదీ కృతజ్ఞతలు చెప్పారు. పరస్పర ప్రయోజనాలు గల ప్రాంతీయ, ప్రపంచ విషయాలపై ఇరు దేశాల ప్రధానులు చర్చించినట్లు భారత ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటింగ్‌ జరగడంతో ఇటీవల యూకే ప్రధాని పదవికి కామెరాన్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY