మోదీకి స‌హారా ముడుపులు: రాహుల్‌గాంధీ

0
33

మెహ‌సానా (గుజ‌రాత్‌): ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ ల‌క్ష్యంగా గుజ‌రాత్ ఎన్నిక‌ల ర్యాలీలో విమ‌ర్శ‌లు గుప్పించారు కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ. మోదీకి తాము డ‌బ్బులు ఇచ్చామ‌ని స‌హారా ఆరు నెలల్లో 9 సార్లు డైరీల్లో రాసింద‌ని రాహుల్ వెల్ల‌డించారు. 2014, న‌వంబ‌ర్‌లో సీబీఐ స‌హారా కార్యాల‌యంపై దాడి చేసినా.. ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేద‌ని విమ‌ర్శించారు. అప్ప‌టి గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా మోదీకి స‌హారా ఎప్పుడెప్పుడు ఎంత మొత్తం ఇచ్చింద‌న్న వివ‌రాలు ఆయ‌న వెల్ల‌డించారు. ఐటీ రికార్డుల ప్ర‌కారం 2013, అక్టోబ‌ర్ 13న 2.5 కోట్లు, 2013, నవంబ‌ర్ 12న రూ.5 కోట్లు, 27 న‌వంబ‌ర్‌న రూ.2.5 కోట్లు, 29 న‌వంబ‌ర్‌న రూ.5 కోట్లు, 2013, డిసెంబ‌ర్ 6న రూ.5 కోట్లు, డిసెంబ‌ర్ 19న రూ.5 కోట్లు, 2014, జ‌న‌వ‌రి 13న రూ. 5 కోట్లు, జ‌న‌వ‌రి 28న రూ. 5 కోట్లు, ఫిబ్ర‌వ‌రి 22న రూ. 5 కోట్లు స‌హారా.. మోదీకి ఇచ్చిన‌ట్లు రాహుల్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here