మోదీకి ఫోన్ చేసిన ట్రంప్‌

0
19

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి కంగ్రాట్స్ తెలిపారు. ఇటీవ‌ల ముగిసిన అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీ పార్టీ విజ‌య‌భేరీ మోగించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ట్రంప్ ఫోన్ చేసి మోదీకి విషెస్ తెలిపారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, గోవా, మ‌ణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ప్ర‌భుత్వాలు ఏర్పాటు చేసింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దాదాపు 15 ఏళ్ల త‌ర్వాత బీజేపీ పార్టీ మ‌ళ్లీ అధికారం చేప‌ట్టింది. మోదీకి ట్రంప్ ఫోన్ చేసిన విష‌యాన్ని వైట్‌హౌజ్ వెల్ల‌డించింది. పీఎంవో ట్విట్ట‌ర్‌లోనూ ప్ర‌ధాని ఈ విష‌యాన్ని ట్వీట్ చేశారు. జనవరి 24వ తేదీన కూడా ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. సంయుక్తంగా ముందుకు వెళ్లాలని ఇద్దరూ నిర్ణయించారు. జర్మనీ ఛాన్సలర్ మెర్కల్ కు కూడా ట్రంప్ ఫోన్ చేసినట్లు వైట్ హౌజ్ కార్యదర్శి సీన్ స్పైసర్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here