మోడీపై విమర్శలు గుప్పించిన సోనియా…

0
4

చాలా కాలం తర్వాత యుపిఎ ఛైర్ పర్సన్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కర్నాటక ఎన్నికల సందర్భంగా ప్రజల ముందుకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బెంగళూరులో పర్యటించారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో వచ్చిన కాంగ్రెస్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన సోనియా గాంధీ ప్రధాని మోడీపై విమర్శల జల్లు కురిపించారు. మే 12న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తప్పక ఓటమి పాలవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కన్నడ ప్రజానీకం భారీ విజయాన్ని కట్టబెట్టనున్నారని ఆమె వెల్లడించారు. సభలలో ప్రసంగించడంలో ప్రధాని మోడీ మంచి నేర్ఫరన్నారు. అయితే ఆయన ప్రసంగాలు పేదల కడుపు నింపవని, అనారోగ్యంతో బాధ పడుతున్న వారిని కాపాడలేవని విమర్శించారు. పేదలకు కడుపునిండాలంటే అన్నం, పప్పు కావాలని, ఆరోగ్యం కాలంటే హెల్త్ సెంటర్లు అవసరమని ఆమె సూచించారు. నిరుపేదలకు సైతం మంచి ఆహారం ఉండాలనే గొప్ప లక్ష్యంతోనే సిద్దరామయ్య సర్కార్ సబ్సిడీపై ఆహారాన్ని అందిస్తుందని సోనియా గాంధీ తెలిపారు

LEAVE A REPLY