మోక్షజ్ఞ ఎంట్రీ లేటవడానికి కారణమేంటి?

0
24
నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశంపై సందిగ్ధత నెలకొంది. నిజానికి ఈ ఏడాది మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని బాలయ్య గతంలో ప్రకటించాడు. అయితే మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం కాస్త ఆలస్యమవుతున్నట్టు సమాచారం.
 దానికి కారణం బాలయ్య మదిలో ఉన్న దర్శకులెవరూ ప్రస్తుతం ఖాళీగా లేకపోవడమే. మోక్షజ్ఞ మొదటి సినిమాకు రాజమౌళి, త్రివిక్రమ్‌, కొరటాల శివ, బోయపాటి శ్రీను.. వీళ్లలో ఎవరో ఒకరిని డైరెక్టర్‌గా అనుకుంటున్నాడట బాలయ్య. నిజానికి బాలయ్య కూడా కెరీర్‌ మొదట్లో బాపు, విశ్వనాథ్‌ వంటి దిగ్ధర్శకుల వద్ద పనిచేసి విశేష అనుభవం సంపాదించాడు. అందుకే తన కొడుకు కూడా మొదట్లో టాప్‌ డైరెక్టర్ల సినిమాల్లోనే నటించాలని అనుకుంటున్నాడట. అయితే వీరెవరూ ప్రస్తుతానికి ఖాళీగా లేరు. అందుకే మోక్షజ్ఞ అరంగేట్రానికి కాస్త సమయం పడుతుందని టాక్‌.

LEAVE A REPLY