మొబైల్‌ యాప్‌ ద్వారా బ్యాంకు సేవలు: చంద్రబాబు

0
28

మొబైల్‌ యాప్‌ ద్వారా బ్యాంకు సేవలన్నీ వినియోగించుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఏపీ పర్స్‌ ఆన్‌ చేయగానే 23 సంస్థలు కనిపిస్తాయని చంద్రబాబు తెలిపారు. 23 సంస్థల్లో దేన్నైనా ఎన్నుకుని సేవలు వినియోగించుకోవచ్చని సీఎం చెప్పారు. నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి ఏపీ పర్స్‌ మొబైల్‌ వ్యాలెట్‌ను రూపొందించారు. మొబైల్‌ వ్యాలెట్‌ ద్వారా విడతల వారీగా నగదు బదిలీ చేసుకోవచ్చన్నారు. వారంలో 7 సార్లు లావాదేవీలు చేస్తే రూ.5 చొప్పున 20 రూపాయలు ఇస్తామని తెలిపారు. మొత్తం ప్రక్రియను 4 కేటగిరీలుగా విభజించామని చంద్రబాబు చెప్పారు.

LEAVE A REPLY