మైనారిటీ విద్యార్థులకు రోబోటిక్ శిక్షణ

0
20

మైనారిటీల గురుకుల పాఠశాలల విద్యార్థులకు రోబోటిక్స్ విద్యపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ (టెమ్రీస్) శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించింది. తొలి విడుతలో హైదరాబాద్ జిల్లాలో ఎనిమిది విద్యాలయాలకు చెందిన ఏడవ తరగతి విద్యార్థులకు ముఫకంజా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎంజేసీఈటీ) లో రోబోటిక్ వర్క్‌షాపును నిర్వహిస్తున్నది. ఆ తర్వాత విడుతలవారీగా తెలంగాణ జిల్లాల్లోని ఆయా ప్రాంతాల్లో ఈ తరహా వర్క్‌షాపులు నిర్వహిస్తారు. ప్రతి విద్యార్థికీ పూర్తిస్థాయి మాన్యువల్ రోబోట్ డిజైన్, తయారీ విధానంపై శిక్షణ ఇస్తారు. ఎంజేసీఈటీకి చెందిన ఈసీఈ తృతీయ సంవత్సరం విద్యార్థి మహ్మద్ ఫైసల్, ఇంజినీరింగ్ విద్యార్థులతో కూడిన అతని బృందం విద్యార్థులకు రోబోల సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇస్తున్నది. రోబో మిషన్, పేరెంట్స్ అండ్ చైల్డ్ రోబో, క్వాడ్‌కాప్టర్, స్పైడ్ రోబో, క్లీన్ రోబోల తయారీని ప్రాజెక్టులుగా తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here